తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​ క్రిస్మస్​ 'కానుక'పై ట్రంప్​ చమత్కారం - latest north korea news

క్రిస్​మస్​ కానుకగా క్షిపణి పరీక్షను నిర్వహిస్తానని చెప్పిన ఉత్తర కొరియా.. ఆ పని చేయదని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. ఆ కానుక ఓ మంచి పూలకుండి అయ్యే అవకాశముందని చమత్కరించారు.

Trump hopes for Christmas vase, not missile test, from NKorea
కిమ్​ క్రిస్మస్​ 'కానుక'పై ట్రంప్​ చమత్కారం

By

Published : Dec 25, 2019, 5:50 AM IST

తనకు క్రిస్మస్​ కానుకగా ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను ఇవ్వదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి అణు చర్చల్లో పురోగతి లేకుంటే.. క్రిస్మస్​ కానుకగా క్షిపణి పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్ బెదిరించిన నేపథ్యంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు.​ అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయన్నారు.

క్రిస్మస్​ కానుకగా తనకు ఓ పూలకుండి అందే అవకాశముందని చమత్కరించారు ట్రంప్​.

"నన్ను ఆశ్చర్యపరచడానికి అందరి దగ్గర కానుకలున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. దానిని రానివ్వండి నేను చూసుకుంటా. వచ్చేది మంచి కానుకే అని ఆశిస్తున్నా. క్షిపణి పరీక్షకు మేము వ్యతిరేకం కాబట్టి కిమ్​ ఓ మంచి పూలకుండి పంపించవచ్చు."

--డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఈ ఏడాది ప్రారంభంలో హనోయి వేదికగా ట్రంప్, కిమ్​ల మధ్య జరిగిన రెండవ శిఖరాగ్ర సమావేశం విఫలమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య అణ్వాయుధీకరణపై చర్చలు క్లిష్టతరంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details