తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 1:37 PM IST

Updated : Oct 1, 2019, 4:49 AM IST

ETV Bharat / international

'హౌదీ-మోదీ' వేదికగా ట్రంప్ కీలక ప్రకటన!

హ్యూస్టన్​ వేదికగా జరగనున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమంలో భారత్​కు అనుకూలంగా కీలక ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తత, భారత్​కు జీఎస్పీ హోదా పునరుద్ధరణ అంశాలపైనే నిర్ణయం వెలువడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 22న హౌదీ-మోదీ కార్యక్రమ వేదికగా భారత ప్రధాని, ట్రంప్​ భేటీ కానున్నారు.

'హౌదీ-మోదీ' వేదికగా ట్రంప్ కీలక ప్రకటన!

భారత్​-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 22న హ్యూస్టన్​లో జరగనున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ కానున్నారు. ఈ వేదికపై భారత్​కు అనుకూలంగా కీలక ప్రకటన చేయనున్నట్లు సంకేతాలిచ్చారు ట్రంప్​.

ముఖ్యంగా గత కొంత కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, భారత్​కు ప్రాధాన్యత గల దేశం హోదా (జీఎస్పీ) పునరుద్ధరణ వంటి అంశాలపైనే నిర్ణయం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్​. హౌదీ-మోదీ కార్యక్రమంలో ఏదైన ప్రకటన చేయబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని ప్రకటనలు ఉంటాయని తెలిపారు. హౌదీ-మోదీ కార్యక్రమానికి తాను హజరవుతున్నట్లు ప్రకటించిన అనంతరం సమావేశానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య మరింత పెరిగిందన్నారు.

సుమారు 50వేల మంది భారతీయ అమెరికన్లతో ఏర్పాటు చేస్తోన్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు ట్రంప్​. ఒకే వేదికపై ట్రంప్​, మోదీ భేటీ కావటం ఇదే తొలిసారి. కాగా మూడు నెలల వ్యవధిలో ఇరువురి మధ్య ఇది మూడో సమావేశం. ఇటీవల జపాన్​లో జీ-20, ఫ్రాన్స్​లో జీ-7 సదస్సుల వేదికగా భేటీ అయ్యారు.

భేటీకి ముందే..

హ్యూస్టన్​లో మోదీ, ట్రంప్​ల భేటీకి ముందుగానే ఇరుదేశాల అధికారులు వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉత్పత్తులపై భారత్​ అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్​ ఆరోపించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుపక్షాలు సుంకాలు పెంచాయి. అనంతరం భారత్​కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను తొలగించారు ట్రంప్​.

Last Updated : Oct 1, 2019, 4:49 AM IST

ABOUT THE AUTHOR

...view details