తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2019, 2:40 PM IST

Updated : Nov 17, 2019, 6:56 PM IST

ETV Bharat / international

హఠాత్తుగా ట్రంప్​కు వైద్య పరీక్షలు.. ఏమీ లేదన్న శ్వేతసౌధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని తెలిపింది శ్వేతసౌధం. ఆయన ఎప్పటిలాగే.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేసింది. సాధారణ వైద్య చికిత్సల కోసమే.. వాషింగ్టన్​లోని సైనికాసుపత్రికి వెళ్లారని ప్రకటించింది.

హఠాత్తుగా ట్రంప్ వైద్య పరీక్షలు.. ఏమీ లేదన్న శ్వేతసౌధం

హఠాత్తుగా ట్రంప్​కు వైద్య పరీక్షలు.. ఏమీ లేదన్న శ్వేతసౌధం

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మరోమారు శ్వేతసౌధ పీఠాన్ని అధిరోహించాలని డొనాల్డ్​ ట్రంప్​ ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఎడతెరిపి లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఈ తరుణంలో వాషింగ్టన్​లోని ఆ దేశ సైనిక ఆసుపత్రిలో ట్రంప్​ హఠాత్తుగా వైద్య చికిత్సలు చేయించుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్​ ఆరోగ్యానికి ఏమైంది? అన్న సందేహాలు అంతటా ఉద్భవించాయి. ఈ ప్రశ్నలన్నింటికీ ఫుల్​స్టాప్​ పెట్టారు శ్వేతసౌధ మీడియా​ కార్యదర్శి స్టీఫెన్​ గ్రిషమ్​.

సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే అధ్యక్షుడు వాల్ట​ర్​ రీడ్​ జాతీయ సైనిక వైద్య సెంటర్​కు వచ్చారని తెలిపారు. డొనాల్డ్​ ట్రంప్​ ఎప్పటిలాగే.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని ప్రకటించారు. 2020 ఎన్నికల ప్రచార బిజీ షెడ్యూల్​లో ఒకవారం తీరిక దొరకడం వల్లే వైద్య పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు.

" అధ్యక్షుడి ఆరోగ్యానికి ఏమీ కాలేదు. ఈ వారంలో వేలాది మంది అమెరికన్ల ముందు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న విధంగానే.. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధతో చికిత్స నిర్వహించిన అధికారులకు ట్రంప్​ కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి నుంచి వెళ్లే ముందు అఫ్గానిస్థాన్​లో గాయపడ్డ అమెరికా ప్రత్యేక దళం సైనికుల కుటుంబాలతో ట్రంప్​ ముచ్చటించారు. వాల్టర్​ రీడ్​ నేషనల్​ మెడికల్ సెంటర్​కు రావడం అధ్యక్షుడికిది తొమ్మిదో సారి."

- స్టీఫెన్​ గ్రిషమ్, శ్వేతసౌధ మీడియా​ కార్యదర్శి

అయితే ట్రంప్ వైద్య పరీక్షల్లో ఏం తేలిందే ఆమె వెల్లడించలేదు.

ఇదీ చూడండి : ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్​ చెప్పిన కథ ఇది!

Last Updated : Nov 17, 2019, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details