తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇరాన్​తో​ యుద్ధానికి ఎక్కువ సమయమేమీ పట్టదు' - g-20

ఇరాన్​తో యుద్ధానికి సుముఖంగా లేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ యుద్ధం మొదలైతే పూర్తయ్యేందుకు ఎక్కువ సమయమేమీ పట్టదని వ్యాఖ్యానించారు.

ట్రంప్​

By

Published : Jun 27, 2019, 7:00 AM IST

Updated : Jun 27, 2019, 8:00 AM IST

ఇరాన్​పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఇరాన్​తో యుద్ధాన్ని కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా పూర్తి శక్తితో పోరాడుతుందన్నారు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

"యుద్ధాన్ని మేం కోరుకోవటం లేదు. కానీ మేం బలమైన స్థానంలో ఉన్నాం. ఏదైనా జరిగితే మా బలాన్నంతా ఉపయోగిస్తాం. యుద్ధం ముగిసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు."

-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అణు ఒప్పందం నుంచి 2015లో అమెరికా వైదొలిగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అణు కార్యకలాపాలు నిలిపివేయాలని ఇరాన్​పై అనేక ఆంక్షలను విధించింది అమెరికా. ఇటీవల హొర్మూజ్​ జలసంధి సమీపంలో అమెరికా డ్రోన్​ను ఇరాన్​ కూల్చిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.

పుతిన్​తో ట్రంప్​ భేటీ

జపాన్​లో జరగబోయే జీ-20 దేశాల సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ట్రంప్​ భేటీ కానున్నారు. ఇరాన్​, సిరియా సంక్షోభాలు, ఆయుధ నియంత్రణపై ఇరువురునేతలు చర్చించనున్నారు.

ఇదీ చూడండి: ఇరాన్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది : పాంపియో

Last Updated : Jun 27, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details