తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని కోర్టుకెక్కిన ట్రంప్ - Trump Social Media

తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా (Trump Twitter Account) పునరుద్ధరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Social Media).. ఓ జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దేశంలో రాజకీయ ప్రసంగాలను ట్విట్టర్ నియంత్రిస్తోందని ఆరోపించారు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

trump news
trump news

By

Published : Oct 3, 2021, 9:57 AM IST

తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Social Media) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకౌంట్​ను తాత్కాలికంగా పునరుద్ధరించాలని కోరారు. (Donald Trump news) ఈ మేరకు ఫ్లోరిడాలోని ఓ జిల్లా కోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన ఒత్తిడి వల్లే తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ట్రంప్ (Trump Twitter Account) ఆరోపించారు. సామాజిక మాధ్యమ ఖాతాల శాశ్వత పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పిటిషన్ వేశారు ట్రంప్.

"దేశంలో రాజకీయ ప్రసంగాలను ట్విట్టర్ నియంత్రిస్తోంది. అది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

ఫేస్​బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలపై జులైలోనే వ్యాజ్యం దాఖలు చేశారు ట్రంప్. ఈ సంస్థల సీఈఓల స్థాయి ప్రభుత్వ వ్యక్తుల స్థాయికి మారిపోయిందని ఆరోపించారు. యూజర్లపై సెన్సార్​షిప్ విధిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు.

అయితే, ట్రంప్ ఖాతాపై విధించింది సెన్సార్​షిప్ కాదని ఫేస్​బుక్, ట్విట్టర్ చెబుతున్నాయి. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసాకాండను దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమం మేరకే ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపాయి. బ్యాన్ సమయంలో ట్విట్టర్​లో ట్రంప్​నకు 8.8 కోట్ల మంది ఫాలోవర్లు (Trump Twitter Followers) ఉన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details