అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిగా సేవలందిస్తున్న జాన్ బోల్టన్‌కు ఉద్వాసన పలికారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. విదేశీ వ్యవహారాలతో పాటు పలు రాజకీయ అంశాల్లో తనతో విభేదిస్తున్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ట్రంప్.
ఈ అంశంపై ట్విట్టర్లో తెలిపిన డొనాల్డ్.. తదుపరి సలహాదారు పేరును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. బోల్టన్ తొలగింపు.. అనూహ్యంగా జరిగింది. మరో గంటలో ఆయన... అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి పాంపియోతో కలిసి మీడియా సమావేశం నిర్వహించాల్సిన సమయంలో ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.