తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ షాకింగ్​ నిర్ణయం.. రక్షణ మంత్రి ఎస్పర్​పై వేటు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్​ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన మార్క్​ టీ ఎస్పర్​కు ఉద్వాసన పలికారు. ఆయనను పదవీ బాధ్యతల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు ట్రంప్​. ఇటీవల భారత్​-అమెరికా మధ్య బెకా ఒప్పందం కుదర్చడంలో ఎస్పర్​ కీలకంగా వ్యవహరించారు.

esper trump latest news
ట్రంప్​ షాకింగ్​ నిర్ణయం.. రక్షణ మంత్రి ఎస్పర్​పై వేటు

By

Published : Nov 10, 2020, 3:35 AM IST

Updated : Nov 10, 2020, 3:42 AM IST

రెండోసారి అధ్యక్షుడవ్వాలన్న కల చెదిరిన వేళ.. ట్రంప్​ తన మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటమికి పరోక్షంగా కారకులైన తన వర్గంలోని కొందరు అధికారులను ఉద్యోగంలోంచి తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రక్షణ మంత్రిగా పనిచేసిన మార్క్​ టీ ఎస్పర్​ను పదవి నుంచి తప్పించారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్​.

ఎస్పర్​ స్థానంలో నేషనల్​ కౌంటర్​ టెర్రరిజం సెంటర్​ డైరెక్టర్​ క్రిస్టోఫర్​ మిల్లర్​ను నియమించారు. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్పర్​ సేవలకు ట్రంప్​ ధన్యవాదాలు చెప్పారు.

సాధారణంగా నూతన అధ్యక్షులు, రెండోసారి పదవి చేపట్టిన అధ్యక్షులు మాత్రమే కేబినేట్​ సభ్యులు, రక్షణ మంత్రులను మార్చేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఓడిపోయి కేవలం రెండు నెలలే అధికారంలో ఉండే అధ్యక్షుడు పాత బృందాన్నే కొనసాగిస్తారు. అయితే ట్రంప్​ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదే కారణమా..

ఎస్పర్​ పదవి ఊడటానికి ట్రంప్​తో సరైన సత్సంబంధాలు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను.. ఆయన పూర్తిస్థాయిలో నియంత్రించడంలో విఫలమయ్యారని ట్రంప్​ భావించినట్లు తెలుస్తోంది.

బెకా ఒప్పందంలో కీలకంగా..

భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకంగా పేర్కొన్న బెకా ఒప్పందం గత నెలలోనే కుదిరింది. అయితే ఇది విజయవంతంగా పూర్తి కావడంలో రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌ కీలకంగా వ్యవహరించారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 10, 2020, 3:42 AM IST

ABOUT THE AUTHOR

...view details