తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​1బీ వీసాలపై మరోమారు ఆంక్షల పొడిగింపు

హెచ్​1బీ వీసాలపై మరో 3 నెలల పాటు ఆంక్షలు పొడిగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికా కార్మికుల ఉద్యోగ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు. ట్రంప్​ తాజా నిర్ణయం వేలాది భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపనుంది.

Donald trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Jan 1, 2021, 10:43 AM IST

విదేశీ నిపుణులకు అందించే హెచ్​1బీ సహా ఇతర వర్క్​ వీసాలపై ఆంక్షలను మరో మూడు నెలలు పొడింగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. మార్చి 31 వరకు హెచ్​1బీ వీసాల రద్దు కొనసాగుతుందని తెలిపారు. దేశంలో కొవిడ్​-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. లేబర్​ మార్కెట్​, కమ్యూనిటీ హెల్త్​ వ్యవస్థపై పూర్థిస్థాయిలో వాటి ప్రభావం లేకపోవటం, అమెరికా కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వివిధ రకాల వర్క్​ వీసాలపై ఆంక్షలను గత ఏడాది ఏప్రిల్​ 22, జూన్​ 22న రెండు సార్లు జారీ చేశారు ట్రంప్​. డిసెంబర్​ 31తో ఆ గడువు ముగియనుంది. కొద్ది గంటల ముందు తాజాగా మరోమారు ఆదేశాలు జారీ చేశారు.

" అమెరికన్ల జీవనంపై కరోనా తీవ్రత కొనసాగుతోంది. నవంబర్​లో​ నిరుద్యోగిత రేటు 6.7 శాతంగా ఉంది. అది గత ఏప్రిల్​తో పోలిస్తే భారీగా తగ్గింది. అమెరికన్లకు చికిత్స, కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. కానీ, వాటి ప్రభావం లేబర్​ మార్కెట్​, కమ్యూనిటీ హెల్త్​పై పూర్తిస్థాయిలో లేదు. అంతే కాకుండా, వ్యాపారాలపై రాష్ట్రాలు విధిస్తోన్న ఆంక్షలు కార్మికుల నియామకాలను ప్రభావితం చేస్తున్నాయి. ​"

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

భారత ఐటీ నిపుణులపై ప్రభావం..

అధ్యక్షుడు ట్రంప్​ తాజా నిర్ణయం వందలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే 2021 ఆర్థిక ఏడాది కోసం గత అక్టోబర్​లో నుంచి హెచ్​1బీ వీసాలు జారీ చేసిన పలు అమెరికా, భారత కంపెనీలపైనా ఈ ప్రభావం పడనుంది. హెచ్​1బీ వీసాల కోసం ప్రతి ఏటా భారత్​, చైనా నుంచే అధికంగా దరఖాస్తులు వస్తాయి. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల మార్చి 31 వరకు వీసా స్టాంపింగ్​ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ఇదీ చూడండి:సాగర గర్భంలో చైనా డ్రోన్లు- భారత్‌ లక్ష్యంగా ఎత్తులు

ABOUT THE AUTHOR

...view details