తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాక్​తో సంబంధాలపై మోదీకి ట్రంప్ సూచన' - అమెరికా

పాకిస్థాన్​తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సూచించినట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఇరువురి మధ్య జరిగిన భేటీపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

'పాక్​తో సంబంధాలపై మోదీకి ట్రంప్ సూచన'

By

Published : Sep 25, 2019, 3:23 PM IST

Updated : Oct 1, 2019, 11:38 PM IST

'పాక్​తో సంబంధాలపై మోదీకి ట్రంప్ సూచన'

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్​తో బలహీనపడిన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సూచించినట్లు శ్వేతసౌధం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భాగంగా మంగళవారం ఇరువురి మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీపై అధికారిక ప్రకటన విడుదల చేసింది​.

ఐరాస వార్షిక సదస్సులో భాగంగా ట్రంప్​తో నాలుగోసారి భేటీ అయ్యారు మోదీ. ఈ సమావేశంలో సుమారు 40 నిమిషాల పాటు ద్వైపాక్షిక వాణిజ్యం, పాకిస్థాన్​ ఎగదోస్తున్న తీవ్రవాదానికి సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపింది శ్వేతసౌధం.

" ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారాల్లో పురోగతిని ట్రంప్​ గుర్తు చేశారు. పాకిస్థాన్​తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మోదీని అధ్యక్షుడు ట్రంప్​ ప్రోత్సహించారు. కశ్మీర్​ ప్రజలకు మెరుగైన జీవనం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు."

- శ్వేతసౌధం.

ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అఫ్గానిస్థాన్​లోని పరిస్థితులపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది శ్వేతసౌధం. అక్కడ భద్రత పెంపు, అభివృద్ధికి ఏ విధంగా కలిసి పనిచేయాలనే అంశంపై చర్చించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: గ్రెటా థన్‌బర్గ్‌కు 'ప్రత్యామ్నాయ నోబెల్'​ పురస్కారం

Last Updated : Oct 1, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details