2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌తో రష్యా ప్రభుత్వం రహస్య ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలు నిరాధారమని యూఎస్ అటార్నీ జనరల్ విలియమ్ బార్ స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్ నివేదికలో తెలిపినట్లు బార్ వివరించారు.
దర్యాప్తు సమయంలో రష్యా ప్రభుత్వంతో సంబంధాలున్న, ట్రంప్ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన అధికారులందరినీ విచారించినట్లు తెలిపారు. అమెరికా నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించలేదని వెల్లడించారు అటార్నీ జనరల్.
రష్యా ప్రభుత్వం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకోవాలని భావించినట్లు మాత్రం విలియమ్ బార్ తెలిపారు.