తెలంగాణ

telangana

ETV Bharat / international

సైనిక ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్ఛార్జి

కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. కొవిడ్ గురించి ఎవరూ భయపడొద్దని, అవసరమైన సమాచారం, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని ట్రంప్ తెలిపారు.

trump-discharged-from-hospital-on-monday-evening
సైనిక ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్ఛార్జి

By

Published : Oct 6, 2020, 5:19 AM IST

కొవిడ్‌-19 బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. వైరస్​ నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

"కొవిడ్‌ గురించి ఎవరూ భయపడొద్దు. మీ జీవితంలో వైరస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా చూసుకోండి. ట్రంప్‌ పరిపాలనలో మనం చాలా అభివృద్ధి చెందాం. కరోనా నియంత్రణకు అవసరమైన సమాచారం, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. 20 ఏళ్ల కిత్రం కంటే కూడా ఇప్పుడు నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను’’ అని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అవ్వడానికి ముందు ట్వీట్​ చేశారు ట్రంప్.

ట్రంప్‌ దంపతులు ఈనెల 1న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా సోకినట్లు తెలేంది. దీంతో వారు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అనంతరం కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువ ఉన్నందున ట్రంప్‌ ఈ నెల 2న వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details