భారతీయులందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యంలో దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం మత స్వేచ్ఛను జ్ఞాపకం చేసుకోవడమేనని ఆయన ఉద్ఘాటించారు. శ్వేతసౌధంలో కొందరు భారతీయులతో కలిసి ఒక రోజు ముందు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ట్రంప్. తన పరిపాలనలో అన్ని హక్కులను పరిరక్షిస్తామన్నారు. ప్రజలందరి విశ్వాసాలను గౌరవిస్తామని.. ఎవరి మనస్సాక్షికి నచ్చినట్లు వారు ప్రార్థనలు చేసుకోవచ్చన్నారు ట్రంప్.
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ - white house latest news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్
దీపావళి వేడుకలు సంతోషకరంగా సాగాలని ట్రంప్ అభిలాషించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా ఆయన దీపావళిని అభివర్ణించారు.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్, కశ్మీర్ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
Last Updated : Oct 26, 2019, 9:01 AM IST