తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా ముప్పును ఎన్నడూ విస్మరించలేదు' - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

జో బైడెన్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 'టౌన్​హాల్​' కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా సంక్షోభాన్ని తాను ఎన్నడూ తక్కువ చేసి చూడలేదన్నారు. వైరస్​ కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే మాస్కుల పనితీరుపై మాత్రం అనుమానాలు వ్యక్తంచేశారు.

Trump denies downplaying virus, casts doubt on mask usage
'కరోనా ముప్పును నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు'

By

Published : Sep 16, 2020, 12:17 PM IST

కరోనా సంక్షోభాన్ని తాను తక్కువ చేసి చూసినట్టు వచ్చిన వార్తలను మరోమారు ఖండించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వైరస్​ను ఎదుర్కొనేందుకు తాను చేపట్టిన చర్యలే ఇందుకు సాక్ష్యమన్నారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. 'టౌన్​హాల్​' కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"కరోనా ముప్పును నేను ఎప్పడూ తక్కువ చేసి చూడలేదు. నిజానికి.. ఇంకా ఎక్కువే చేశా. ఎన్నో కఠిన, దృఢమైన చర్యలు తీసుకున్నా. నేను నిజమే చెబుతున్నా. ప్రజలు భయపడిపోవడం నాకు ఇష్టం లేదు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అయితే ట్రంప్​ ప్రస్తుత మాటలు.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.

మాస్కులపై వీడని సందేహం...

మరోవైపు... తన సొంత యంత్రాంగం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ.. మాస్కుల పనితీరుపై ట్రంప్​కు ఇంకా సందేహాలు ఉన్నట్టు కనపడుతోంది. మాస్కులతో ఉపయోగం లేదని నమ్మేవారు చాలా మంది ఉన్నారని ఆయన​ చెప్పడమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి:-కారు దిగకుండానే ఓటేసి వెళ్లిపోవచ్చు!

'చైనాను విశ్వసించా.. కానీ'

ఈ ఏడాది తొలినాళ్లలో.. కరోనా కట్టడికి చైనా చేపట్టిన చర్యలను తాను నిజంగా విశ్వసించినట్టు పేర్కొన్నారు ట్రంప్​. పరిస్థితి అదుపులోనే ఉందని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ చెప్పారని.. ఆ మాటలను తాను నమ్మి ఆ దేశాన్ని పొగిడానని అంగీకరించారు. కానీ అవి నిజం కాదని ఆలస్యంగా అర్థమైనట్టు వివరించారు.

సమరానికి సన్నద్ధం...

ఈ నెల 29 నుంచి రిపబ్లికన్​ ట్రంప్​- డెమొక్రాట్​ జో బైడన్​ మధ్య అధ్యక్ష ఎన్నికల్లోనే అత్యంత రసవత్తరమైనసంవాదాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ టౌన్​హాల్​ కార్యక్రమాన్ని సన్నద్ధంగా ట్రంప్​ పరిగణించినట్టు తెలుస్తోంది. ప్రేక్షకుల ప్రశ్నలకు అవసరమైనప్పుడు రక్షణాత్మక ధోరణిని పాటిస్తూనే.. మిగిలిన సమయంలో తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

ఇదీ చూడండి:-'సిరియా అధ్యక్షుడిని అప్పుడే లేపేద్దామనుకున్నా'

ABOUT THE AUTHOR

...view details