తెలంగాణ

telangana

ETV Bharat / international

'అభిశంసన'పై తక్షణ విచారణ చేపట్టండి: ట్రంప్​ - us president latest news

అమెరికా దిగువ సభలో ఆమోదం తెలిపిన తన అభిశంసన తీర్మానంపై సెనేట్​లో తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆరోపణలను రుజువు చేసేందుకు డెమొక్రాట్ల వద్ద ఒక్క సాక్ష్యాధారం కూడా లేదని ట్వీట్​ చేశారు. మరోవైపు కెనడా కాంటినెంటల్​ బిల్లుకు 385 ఓట్లతో దిగువ సభలో భారీ మద్దతు లభించడం గమనార్హం.

trump impeachment
అభిశంసనపై సెనేట్​లో తక్షణ విచారణకు ట్రంప్ డిమాండ్​

By

Published : Dec 20, 2019, 9:49 AM IST

Updated : Dec 20, 2019, 3:00 PM IST

'అభిశంసన'పై తక్షణ విచారణ చేపట్టండి: ట్రంప్​

ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల మద్దతుతో ఆమోదం పొందిన తన అభిశంసన తీర్మానంపై సెనేట్​లో వెంటనే విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. సెనేట్​లో ఈ అభిశంసన కచ్చితంగా వీగిపోతుందన్నారు. తనపై అభియోగాలను రుజువు చేసేందుకు డెమొక్రాట్ల వద్ద ఒక్క సాక్ష్యాధారమూ లేదని ట్వీట్​ చేశారు ట్రంప్. రిపబ్లికన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకతాటిపై ఉన్నారని తెలిపారు.

"అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల నుంచి ఒక్క ఓటు కూడా రాలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రిపబ్లికన్లంతా ఐక్యంగా ఉన్నారు. తీర్మానంపై ఎగువ సభలో విచారణ చేపట్టేందుకూ డెమొక్రాట్లు సిద్ధంగా లేరు. ఎందుకంటే అవినీతి నాయకుడు ఆడమ్​ స్కిఫ్​​ ప్రమాణ స్వీకారం చేయడాన్ని వారు కోరుకోవట్లేదు, రహస్య సమాచారం చేరవేసే బిడెన్ రావడాన్ని వారు ఇష్టపడట్లేదు. "

-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్​

ట్రంప్​ విజయం..

ట్రంప్​పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందినప్పటికీ కెనడా, మెక్సికోలతో ఖండాంతర వాణిజ్య ఒప్పందానికి దిగువ సభలో భారీ మెజార్టీ లభించింది. బిల్లుకు అనూకూలంగా ఏకంగా 385 ఓట్లు వచ్చాయి. కేవలం 41 ఓట్లు వ్యతిరేకంగా నమోదయ్యాయి. రిపబ్లికన్లకు సెనేట్​లో అధిక్యం ఉన్నందున అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2018లోనే కుదిరింది. అయితే ఒప్పంద ధ్రువీకరణ, మెక్సికో కార్మిక సంస్కరణలు తీసుకురావాలని డెమొక్రాట్లు డిమాండ్​ చేయడం వల్ల ఆలస్యమైంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుకు భారీ మెజార్టీ రావడం ట్రంప్​న​కు ఊరటనిచ్చే విషయమే.

ఇదీ చూడండి: 5,700 ఏళ్లనాటి బాలిక ఎలా ఉంటుందో చెప్పిన 'చూయింగమ్​'​!

Last Updated : Dec 20, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details