తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ అభిశంసన: మూడు గంటల్లో ముగిసిన విచారణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో అభిశంసనపై సెనేట్​లో జరుగుతోన్న విచారణను మూడు గంటల్లోనే ముగించేశారు ట్రంప్ తరఫు న్యాయవాదులు. పదవీకాలం ముగిశాక మాజీ అధ్యక్షుడిపై అభిశంసన చెల్లదని వాదించారు.

Impeachment trial: Trump defense
ట్రంప్​ అభిశంసన: మూడు గంటల్లో ముగిసిన విచారణ

By

Published : Feb 13, 2021, 5:49 AM IST

Updated : Feb 13, 2021, 7:24 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అభిశంసనపై సెనేట్​ విచారణలో భాగంగా.. తమ వాదనను 3గంటల్లోనే ముగించేశారు ట్రంప్ తరఫు న్యాయవాదులు. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్​ ఘటనకు సంబంధించి ట్రంప్​ తన మద్దతుదారులను ప్రేరేపించలేదని విచారణలో భాగంగా వాదించారు. రెండో అభిశంసనను డెమొక్రాట్ల రాజకీయ కుట్రగా అభివర్ణించిన ట్రంప్​ తరఫు లాయర్లు... పదవీకాలం ముగిశాక అభిశంసన వేటు చెల్లదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​!

క్యాపిటల్​ హింసకాండకు ట్రంప్​ కారకుడని రుజువు చేసేందుకు డెమొక్రాట్ల వద్ద సరైన ఆధారాలు లేవని ట్రంప్ న్యాయవాది బ్రూస్ కాస్టర్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్​ శాంతి భద్రతలకు ప్రాధాన్యమిచ్చేవారు అని పేర్కొన్నారు.

మొత్తంగా రెండు రోజుల్లో 16 గంటల పాటు వాదించేందుకు ట్రంప్​ తరఫు న్యాయవాదులకు అవకాశమున్నా.. వారు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.

ఇదీ చదవండి:కొత్త వీడియోలతో ట్రంప్​కు మరిన్ని చిక్కులు!

Last Updated : Feb 13, 2021, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details