అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే శ్వేతసౌధాన్ని శాంతియుతంగా విడిచిపెడతారా? అన్న ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు ట్రంప్.
ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాన్న ట్రంప్.. దాని వల్ల తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు. ఎన్నికల్లో మెయిల్ ఇన్ ఓట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. నెలరోజులుగా ట్విట్టర్‌తో సహా పలు వేదికలపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. విస్తృతమైన మెయిల్ ఓటింగ్ విధానం సురక్షితం కాదన్న ఆయన.. దీని వల్ల భారీ మోసాలు జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.