తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి-ట్రంప్​కు పరీక్షలు - america nation emergency

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో ఆరోగ్య అత్యయిత పరిస్థితిని విధించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Trump declares coronavirus national emergency
అమెరికాలో జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి

By

Published : Mar 14, 2020, 5:48 AM IST

Updated : Mar 14, 2020, 6:47 AM IST

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఆ దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ( హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల ఫెడరల్​ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

"ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న సర్వాధికారాలను వినియోగించుకుంటూ నేను జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నాను. వ్యాప్తిని అరికట్టేందుకు 50 బిలియన్ డాలర్ల ఫెడరల్​ నిధులను విడుదల చేస్తున్నాం." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అన్ని యూఎస్ రాష్ట్రాలు అత్యవసర ఆపరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం కావాల్సిన కిట్​ల కొరతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్ పరీక్షలు సమర్థవంతంగా జరిపేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా టెస్ట్ చేసుకుంటా?

తాను కూడా కరోనా వైరస్ పరీక్ష చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు ట్రంప్. అయితే ఇదివరకే కరోనా సోకిన వారితో సమావేశమైన కారణంగా మాత్రం టెస్టులు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.

గతవారాంతంలో ఫ్లోరిడాలో ట్రంప్, వైస్ ప్రెసిడెంట్​ మైక్​ పెన్స్​తో కలిసి భోజనం చేసిన బ్రెజిల్​కు చెందిన ఓ అధికారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కరోనా టెస్ట్​కు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పరీక్ష కేంద్రాలు ఏర్పాటుకు కృషి

అన్ని యూఎస్ రాష్ట్రాలు అత్యవసర ఆపరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం కావాల్సిన కిట్​ల కొరతపై విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్ పరీక్షలు సమర్థవంతంగా జరిపేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

వీసా... రద్దు

మార్చి 16 నుంచి తదుపరి ప్రకటన వచ్చే వరకు ఇమిగ్రెంట్, నాన్​ ఇమిగ్రెంట్​ వీసా అపాయింట్​మెంట్లు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యూఎస్ మిషన్ ఇండియా తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా కట్టడికి సైన్యానికి 24 గంటల సమయం

Last Updated : Mar 14, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details