అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ప్రత్యేకమే. అంతర్జాతీయ అంశాలైనా, అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారమైనా అందులో ట్రంప్ తనదైన ముద్ర వేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజున ఆయన తన డ్యాన్స్ వీడియోను ట్వీట్ చేసి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ.. ట్రంప్ లాస్ట్ టచ్ - US elections latest news
అమెరికా ఎలక్షన్ డే సందర్భంగా తాను డ్యాన్స్ చేసిన వీడియోను ట్వీట్ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ తన మద్దతుదారులను ఉత్సహపరిచేందుకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనపడుతుంది. ఈ ట్వీట్లో ఓట్! ఓట్! ఓట్! అని రాసుకొచ్చారు ట్రంప్.
ట్రంప్ లాస్ట్ టచ్- నృత్యం చేసిన వీడియో వైరల్
ఈ వీడియోలో వేర్వేరు ప్రచార ర్యాలీల్లో నృత్యం చేస్తూ మద్దతుదారులను ఉత్సహపరుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనికి ట్రంప్.. ఓట్, ఓట్, ఓట్ అనే క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియోను ట్రంప్ మద్దతుదారులు తెగ రీట్వీట్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:తుది ఘట్టానికి అధ్యక్ష పోరు- ఫలితంపై ఉత్కంఠ