తెలంగాణ

telangana

ETV Bharat / international

చిల్​ గ్రెటా, చిల్​..! సినిమా చూసి ఎంజాయ్​ చెయ్​: ట్రంప్​ - ట్రంప్​ తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్.. వ్యంగ్యంగా మాట్లాడటంలో తనకు తానే దిట్ట. మాటల్లో వెటకారానికి కొదవ ఉండదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? వాతావరణ మార్పులపై ఉద్యమం చేస్తోన్న 16 ఏళ్ల గ్రెటా థెన్​బెర్గ్​పై తాజాగా ట్రంప్​ ఓ ట్వీట్​ చేశారు. ఏమన్నారో చూడండి మరి!

Trump criticizes climate activist Thunberg after Time honor
చిల్​ గ్రెటా, చిల్​.. ! సినిమా చూసి ఎంజాయ్​ చెయ్​: ట్రంప్​

By

Published : Dec 13, 2019, 5:46 AM IST

Updated : Dec 13, 2019, 5:55 AM IST

ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్... 'పర్సన్​ ఆప్ ది ఇయర్ 2019'గా స్వీడన్ కు చెందిన వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థెన్​బెర్గ్ ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రఖ్యాత అమెరికా రచయిత రోమా డౌనీ ట్విట్టర్‌లో గ్రెటా‌ను పొగిడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే ట్వీట్‌ను ప్రస్తావిస్తూ గ్రెటాపై కౌంటర్​ వేశారు.

ట్రంప్​ ట్వీట్

"ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం. గ్రెటా ముందుగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వీలైతే ఫ్రెండ్‌తో పాటు ఓ సినిమాకి వెళ్లాలి! చిల్ గ్రెటా, చిల్!" - ట్విట్టర్​లో డొనాల్డ్​ ట్రంప్

ట్రంప్​ ట్వీట్​కు అదే రీతిలో కౌంటర్​ ఇచ్చింది థెన్​బెర్గ్​. ట్రంప్​ చెప్పినట్టే తన ట్విట్టర్ బయోను మార్చింది.

గ్రెటా ట్విట్టర్​ బయో

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా 'గ్లోబల్‌ యూత్‌ మూమెంట్‌' పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్‌ బాలిక.

Last Updated : Dec 13, 2019, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details