అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సరికొత్త సామాజిక మాధ్యమంతో (Trump Social Media platform) భారీగా ఆర్జించనున్నారు. సంస్థ పనితీరు మెరుగ్గా ఉంటే స్పెషల్ బోనస్ షేర్ల కింద వందల కోట్లు వెనకేసుకునే అవకాశం ఉంది.
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్(టీఎంటీజీ) పేరుతో తన కొత్త సంస్థను (Trump Social Media) మాజీ అధ్యక్షుడు గత వారం ప్రకటించారు. 'ట్రూత్ సోషల్' (Truth Social Media app) పేరుతో మెసేజింగ్ యాప్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ట్విట్టర్, ఫేస్బుక్ సంస్థలకు పోటీ ఇవ్వనుంది. వారెంట్ కన్వర్టబుల్ ద్వారా ఈ సంస్థ.. వచ్చే మూడేళ్లలో 40 మిలియన్ షేర్లను సృష్టించనుంది. ఈ మూడేళ్లలో సంస్థ షేరు ఏ మేరకు రాణిస్తుందనే అంశంపై.. షేర్ల మొత్తం సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఒక షేరు కనీసం 30 డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ ట్రేడింగ్ చేస్తే.. వారెంట్ కన్వర్టబుల్ 40 మిలియన్ షేర్లుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సంస్థకు దాదాపు 90 మిలియన్ బోనస్ షేర్లు లభించే అవకాశం ఉంది. వీటి విలువ వేల కోట్లకు పైగా ఉంటుందని సెక్యూరిటీ రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెల్లడైంది.
'డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్ప్' లేదా 'ఎస్పీఏసీ'తో టీఎంటీజీని కలిపేయడం ద్వారా.. పబ్లిక్ లిస్టింగ్ కంపెనీగా ట్రంప్ (Donald Trump news) సంస్థ అవతరించనుంది. ట్రంప్ సోషల్ మీడియా ప్రకటన తర్వాత డిజిటల్ వరల్డ్ షేర్లు రాకెట్లా దూసుకెళ్లాయి. గత ఐదు రోజుల్లో 480 శాతానికి పైగా లాభాలు గడించాయి. మంగళవారం మాత్రం 59.07 శాతం నష్టపోయాయి.
ట్రంప్ బ్రాండ్...
ప్రస్తుత ధరల ప్రకారం ట్రంప్ కంపెనీకి (Trump Social Media platform) బోనస్ షేర్లు జారీ చేస్తే వాటి విలువ 2.4 బిలియన్ డాలర్లు (రూ. 17,990కోట్లు)అవుతుంది. బోనస్ షేర్లకు అదనంగా కంపెనీ విలీనం ద్వారా మరో 87 మిలియన్ల షేర్లు ట్రంప్ సంస్థ సొంతమవుతాయి. వీటి విలువ సుమారు 5.1 బిలియన్ డాలర్లు (రూ. 38,230 కోట్లు) ఉంటుంది.