అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'హెచ్-1 బీ' వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో నిరుద్యోగం పెరుగుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని శ్వేతసౌథం ప్రకటించింది.
ఉపాధి వీసాల నిలిపివేత ప్రతిపాదన.. అమెరికా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబర్ 1 నుంచి అమలు చేసే అవకాశముందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఫలితంగా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అమెరికాలో పనిచేయాలని కోరుకుంటున్న విదేశీ ఐటీ నిపుణులకు ఇబ్బంది తప్పదు. అయితే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తోన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది.
వీటిపై ప్రభావం తప్పదు..
ట్రంప్.. ఉపాధి వీసాలను నిలిపివేయాలని భావిస్తే... హెచ్-1బీ వీసాలతో పాటు స్వల్ప కాలం పనిచేసే కార్మికులకు ఇచ్చే హెచ్-2బీ వీసా, క్యాంప్ కౌన్సిలర్లు, ఏయూ పెయిర్స్కి ఇచ్చే జే-1 వీసా, కంపెనీలో అంతర్గత బదిలీలకు ఇచ్చే ఎల్-1 వీసాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది.
వద్దు అధ్యక్ష!