తెలంగాణ

telangana

ETV Bharat / international

తప్పుకునే ముందు ట్రంప్ 'స్వీయ క్షమాభిక్ష'! - donald trump news today

జనవరి 20న అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేముందు డొనాల్డ్ ట్రంప్​​ 'స్వీయ క్షమాభిక్ష' పెట్టుకోనున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంపై ఆయన సన్నిహితులతో చర్చించినట్లు పేర్కొంది. వాషింగ్టన్​ డీసీలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం ట్రంప్​ దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Trump considering self-pardon: US media reports
పదవి నుంచి తప్పుకునే ముందు ట్రంప్ 'స్వీయ క్షమాభిక్ష'

By

Published : Jan 8, 2021, 7:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పదవి నుంచి తప్పుకునే ముందు 'స్వీయ క్షమాభిక్ష' ప్రసాదించుకునే విషయంపై దృష్టి సారించారని అక్కడి మీడియా తెలిపింది. ట్రంప్​ను అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులతో స్వీయ క్షమాభిక్ష అంశంపై చర్చించినట్లు పేర్కొంది.

స్వీయ క్షమాభిక్ష అనంతరం ఎదురయ్యే న్యాయపరమైన, రాజకీయపరమైన పరిణామాలపై ట్రంప్ తన సన్నిహితులతో గతవారం చర్చించినట్లు సీఎన్​ఎన్​ వార్తా సంస్థ తెలిపింది.

శ్వేతసౌధంలో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ట్రంప్​ను పదవి నుంచి తప్పించాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్​ రెచ్చగొట్టడం వల్లే ఆయన మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు అంతా భావిస్తున్నారు. జనవరి 7న జరిగిన ఈ ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన జో బైడెన్​, కమలా హారిస్​ విజయాలను కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించే సమయంలోనే శ్వేతసౌధంలో ఘర్షణ చెలరేగింది.

క్షమాభిక్ష విషయంపై ట్రంప్ చర్చించడానికి జనవరి 7న జరిగిన ఘటన కారణమా లేక, ఎన్నికల సందర్భంగా జార్జియా సెక్రెటరీకి ఇటీవల చేసిన వివాదాస్పద కాల్​ కారణమా? అనే విషయంపై స్పష్టత లేదు.

అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజు నంచే స్వీయ క్షమాభిక్ష అంశాన్ని ట్రంప్​ పలు సందర్భాల్లో ప్రస్తావించారని న్యూయార్క్​ టైమ్స్​ పేర్కొంది. తన సన్నిహితులిద్దరితో దీని సాధ్యాసాధ్యాలపై చర్చించారని తెలిపింది.

అప్పటి నుంచే...

స్వీయక్షమాభిక్ష హక్కు తనకు ఉందని 2018లోనే ట్విట్టర్​ వేదికగా ట్రంప్​ చెప్పారు. తన రాజకీయ సన్నిహితులు, స్నేహితులకు ఇటీవలే వరుసగా క్షమాభిక్షలు ప్రసాదించారు.

2018లో ట్రంప్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'నన్ను నేను క్షమించుకొనే హక్కు ఉంది' అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారితీశాయి. ఏ వ్యక్తి తన కేసుకు తానే తీర్పు చెప్పుకోకూడదనే సూత్రానికి ఇది విరుద్ధమని వాదించారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు. ఇప్పుడు అది నిజం అయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితమే తన న్యాయసలహాదారు రూడీ గులియానీతో ఈ విషయమై చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని టైమ్స్‌ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇదే సమయంలో ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌, ఇవాంకలక్షమాభిక్ష వ్యవహారాన్ని కూడా చర్చించారు. స్వీయ క్షమాభిక్ష వ్యవహారం మరో న్యాయ పోరాటానికి దారీతీయొచ్చు. అంతేకాదు.. ఫెడరల్‌ చట్టాల నుంచి ట్రంప్‌ తప్పించుకొన్నా.. అమెరికా రాష్ట్రాల చట్టాలు ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది.

ఒకే ఒక్కసారి.

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో ఇప్పటివరకు రిచర్డ్​ నిక్సన్​ మాత్రమే క్షమాభిక్ష పొందారు. అప్పటి ఉపాధ్యక్షుడు గెరాల్డ్​ ఫోర్డ్​ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు. అప్పట్లో ఈ విషయంపై విమర్శలు వచ్చాయి.

అధ్యక్షుడు క్షమాభిక్ష పొందితే పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులు, నేరాల నుంచి విముక్తి కల్పించినట్లవుతుంది.

ఇదీ చూడండి: కరుణామయుడి అవతారమెత్తిన ట్రంప్

ABOUT THE AUTHOR

...view details