అప్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీసుకున్న కీలక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయననుఅభినందించారు. అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత ఘనీ తీసుకున్న చర్యలను ట్రంప్ కొనియాడారని... శ్వేత సౌధం వెల్లడించింది. అఫ్గాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్.... ఆయన చర్యలను అభినందించారని తెలిపింది.
షరతులతో కూడిన ఒప్పందం..
తాలిబన్లతో చేసుకున్న చారిత్రాత్మక శాంతి ఒప్పందం షరతులతో కూడినదే అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధానికి ముగింపు పలకడానికి ఇదీ ముఖ్యమైన ముందడుగు అని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ వెల్లడించారు. దోహాలో తాలిబన్లతో షరతులతో కూడిన శాంతి ఒప్పందం చేసుకున్నామన్న ఆయన... అమెరికా సైనికుల త్యాగాల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు.
ఇదీ చూడండి:బ్రెజిల్లో పడవ బోల్తా..18 మంది మృతి