తెలంగాణ

telangana

ETV Bharat / international

'ముందుంది మంచి కాలం-  మళ్లీ నా గెలుపు తథ్యం' - అమెరికా ట్రంప్​

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తానని తెలిపారు.

Trump confident of winning November election
అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నేనే గెలుస్తా: ట్రంప్​

By

Published : Jul 15, 2020, 6:09 PM IST

నవంబర్​లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈసారి దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తానని ప్రకటించారు.

"ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. మేము చాలా గొప్ప పని చేశాం. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాం. ఉద్యోగాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. మేము చేసినంత ఎవరూ చేయలేదు. ఎన్నికల తేదీ నాటికి అద్భుతాలు చూస్తారు. మూడో త్రైమాసికం బాగుంటుంది. నాలుగో త్రైమాసికం అద్భుతంగా ఉండనుంది. కానీ ఆర్థికపరంగా వచ్చే ఏడాది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల నన్ను నేను మరోమారు అధ్యక్షుడిగా చూసుకుంటున్నా."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ముందస్తు సర్వేలు​ కూడా తనవైపే ఉన్నాయని... దేశంలో ఎన్నడూ చూడని మెజారిటీ తనకు దక్కవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్​.

ఇవీ చూడండి:-

అమెరికా ఎన్నికల ప్రచారం 'చైనా'మయం!

బెర్నీ-బైడెన్​ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?

ABOUT THE AUTHOR

...view details