చైనా తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం కూడా తమకు ఓ ప్రత్యామ్నాయమేనని చెప్పారు.
అయితే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఆధారితాలని.. పూర్తిస్థాయి ఉపసంహరణ అసాధ్యమని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ఉపసంహరణ కూడా ఒక ప్రత్యామ్నాయమేనని ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"వాణిజ్య కమిటీలో లైటిజర్ వ్యాఖ్యలు తప్పేమీ కాదు. ఈ అంశమై నేనే స్పష్టత ఇవ్వలేదు. అయితే విధాన నిర్ణయాల్లో భాగంగా చైనా నుంంచి పూర్తిగా ఉపసంహరించుకోవడాన్ని కూడా అమెరికా ఓ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది."