తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​ నిర్ణయంతో అమెరికన్లకే ఎక్కువ హాని' - పాంపియో

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై ఉగ్రవాద సంస్థ తాలిబన్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో చర్చలు నిలిపివేస్తే అందరికన్నా అమెరికన్లకే ఎక్కువ హాని జరుగుతుందని హెచ్చరించింది. ఒప్పందం కుదురుతున్న సమయంలో శాంతి చర్చలను నిలిపివేయడం సరికాదని విమర్శించింది.

'ట్రంప్​ నిర్ణయంతో అమెరికన్లకే ఎక్కువ హాని'

By

Published : Sep 9, 2019, 9:17 AM IST

Updated : Sep 29, 2019, 11:09 PM IST

తాలిబన్లతో చర్చలు నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిర్ణయాన్ని ఆ ఉగ్రవాద సంస్థ తీవ్రంగా ఖండించింది. ట్రంప్​ నిర్ణయం అందరి కన్నా అగ్రరాజ్యానికే ఎక్కువ హాని కలిగిస్తుందని తమ​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​ ట్విట్టర్​ ఖాతా ద్వారా తాలిబన్​ హెచ్చరించింది.

తాలిబన్​లు, అఫ్గానిస్థాన్ ప్రభుత్వంతో చేపట్టాల్సిన రహస్య శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కాబుల్​లో ఓ అమెరికా సైనికుడు, మరో 11 మందిని తాలిబన్లు చంపడమే ఇందుకు కారణమని చెప్పారు. ట్రంప్​ నిర్ణయంతో అమెరికన్లకే ప్రమాదమని తాలిబన్​ తెలిపింది.

చర్చల నిలిపివేతకు అమెరికా అధ్యక్షుడు వెల్లడించిన కారణం పూర్తిగా అనుభవరాహిత్యంగా ఉందని ఆరోపించింది తాలిబన్​. అగ్రరాజ్యం వందలాది అఫ్గాన్​ల ప్రాణాలు తీసిందని మండిపడింది.

"అందరికన్నా ఎక్కువ అమెరికన్లకే ఎక్కువ హాని జరుగుతుంది. ప్రపంచానికి వారి అసహన వైఖరి తెలుస్తుంది. ప్రాణ, ఆర్థిక నష్టాలు పెరిగిపోతాయి. అంతర్జాతీయ రాజకీయ సంబంధాల్లో అగ్రరాజ్యం పాత్ర బలహీనపడుతుంది."
--- తాలిబన్​, ఉగ్రవాద సంస్థ.

అమెరికాతో ఒప్పందం దాదాపు ఖరారైందని తాలిబన్​ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం అఫ్గాన్​లో శాంతి భద్రతలకు హామి ఇస్తే... బదులుగా దేశం నుంచి అగ్రరాజ్యం బలగాలు వెనుదిరగాలి. ఈ తరుణంలో ట్రంప్​ శాంతి చర్చలను విరమించుకున్నారని తాలిబన్​ పేర్కొంది.

'తాలిబన్లలో మార్పు రావాలి...'

మరోవైపు.. తాలిబన్లతో చర్చలు జరపుతున్న తమ ప్రతినిధిని అగ్రరాజ్యం వెనక్కి పిలిపించింది. చర్చల పునరుద్ధరణ పూర్తిగా తాలిబన్ల చేతిలో ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో వెల్లడించారు. ఇంత వరకు సాగిన చర్చల్లో పురోగతి సాధించినప్పటికీ... తాలిబన్లు తమ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఒప్పందం కేవలం నమూనా మాత్రమేనని... తాలిబన్లలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు పాంపియో. ఈ అంశంపై అధ్యక్షుడు ట్రంప్​ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: దేశంలో ఈ ప్రాంతాలు చాలా 'ఖరీదు'​ గురూ!

Last Updated : Sep 29, 2019, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details