అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రచార వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీ కుంభకోణానికి పాల్పడేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. వెబ్సైట్లో నకిలీ సీబీఐ నోటీస్ పోస్ట్ చేశారు. ట్రంప్ తప్పు చేశారని రుజువు చేసే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఆ పత్రాలను బహిర్గతం చేయాలా వద్దా అనే విషయంపై వీక్షకులు ఓటింగ్‌లో పాల్గొనాలని హ్యాకర్లు వెబ్సైట్లో తెలిపారు. రెండు క్రిప్టో కరెన్సీ వాలెట్లకు నిధులు పంపాలని కోరారు. అయితే కొద్దిసేపటికే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినట్లు ట్రంప్ ప్రచార, కమ్యూనికేషన్స్ డైరక్టర్ టిమ్ ముర్టాఫ్ ట్విట్టర్లో తెలిపారు.
ట్రంప్ వెబ్సైట్ హ్యాక్.. భారీ కుంభకోణానికి యత్నం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. విజిటర్ల నుంచి నిధులు వసూలు చేసి క్రిప్టోకరెన్సీ కుంభకోణానికి పాల్పడేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే కొద్ది సేపటికే వెబ్సైట్న్ను పునరుద్ధరించినట్లు ట్రంప్ ప్రచార డైరెక్టర్ టిమ్ ముర్టాఫ్ తెలిపారు.
ట్రంప్ వెబ్సైట్ హ్యాక్ చేసి కుంభకోణానికి యత్నం
హ్యాకింగ్‌కు ఎవరు పాల్పడరానే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు టిమ్. వెబ్సైట్లో ఎలాంటి సున్నితమైన వివరాలు దాయలేదని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ మూలానికి ట్రంప్ ప్రభుత్వం ప్రమేయం ఉందని, 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు విదేశీ నటులతో ట్రంప్ సంప్రదింపులు జరిపారని హ్యాకర్లు వెబ్సైట్లో పోస్ట్ చేశారు.