తెలంగాణ

telangana

ETV Bharat / international

నిధుల సేకరణలో రికార్డ్​ సృష్టించిన ట్రంప్​..! - రిపబ్లికన్ నేషనల్ కమిటీ

2020 అధ్యక్ష ఎన్నికల కోసం భారీగా నిధులు సమీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 125 మిలియన్ డాలర్లను రిపబ్లికన్ నేషనల్ కమిటీ సమీకరించింది. ఈ మొత్తం అధ్యక్ష ఎన్నికల నిధుల సమీకరణలో ఓ రికార్డు.

ఎన్నికల కోసం భారీగా నిధుల సేకరణ

By

Published : Oct 3, 2019, 9:16 AM IST

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం భారీగా నిధులు సమీకరిస్తున్నారు ట్రంప్ మద్దతుదారులు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 125 మిలియన్ అమెరికా డాలర్లను రిపబ్లికన్ నేషనల్ కమిటీ, డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ కలిసి సమీకరించాయి. ఇది అధ్యక్ష ఎన్నికల నిధుల సమీకరణలో ఓ రికార్డు.

ఒబామా హయాంలో 2011 మూడో త్రైమాసికంలో కేవలం 70 అమెరికా డాలర్లను మాత్రమే సమీకరించారు.

2019లో 308 మిలియన్ అమెరికా డాలర్లను సమీకరించినట్లు ట్రంప్ మద్దతుదారులు వెల్లడించారు. 156 మిలియన్ డాలర్లు బ్యాంకులో నిల్వ ఉన్నట్లు తెలిపారు. ట్రంప్​పై డెమొక్రాట్ల అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఈ నిధుల సమీకరణ చేపట్టారు.

"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం​ ఎదురులేకుండా సాగుతోంది. రికార్డు వేగంతో భారీ స్థాయిలో నిధులు సమీకరిస్తున్నారు."

-బ్రాడ్ పార్స్కేల్, డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజర్

.
"ట్రంప్​పై డెమొక్రాట్ల విమర్శనాస్త్రాలే కార్యకర్తలకు రికార్డు స్థాయిలో నిధులు సమీకరించడానికి ఉత్సాహాన్నిచ్చాయి. 2020 ఎన్నికలలో ట్రంప్​ను అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకొని, డెమొక్రాట్లను జవాబుదారీగా చేయడమే లక్ష్యంగా మిలియన్ల కొద్దీ వెచ్చిస్తున్నాము."

-రొన్నా మెక్​డేనియల్, రిపబ్లికన్ నేషనల్ కమిటీ అధ్యక్షులు

ట్రంప్​నకు మద్దతుగా భారీ ప్రచారాల కోసం నిధుల సేకరణ ప్రారంభించారు. ట్రంప్​ను అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకునేందుకు బిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేయనున్నారు.

డెమొక్రాట్లు అధ్యక్షుడిపై గత వారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే డెమొక్రాట్ల చర్యలకు వ్యతిరేకంగా 8 మిలియన్ అమెరికా డాలర్లను ప్రకటనల నిమిత్తం ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ క్యాంపెయిన్ ప్రకటించింది. అభిశంసన తీర్మానానికి డెమొక్రాట్ల మద్దతుకు వ్యతిరేకంగా రిపబ్లికన్ నేషనల్ కమిటీ కూడా 2 మిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details