తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు షాక్.. పిటిషన్లను కొట్టేసిన కోర్టులు - us elections court

ఎన్నికల్లో అవకతవకలపై కోర్టుకెక్కిన డొనాల్డ్ ట్రంప్ బృందానికి చుక్కెదురైంది. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లో వీరు దాఖలు చేసిన దావాలను కోర్టులు కొట్టివేశాయి.

Trump campaign
డొనాల్డ్ ట్రంప్

By

Published : Nov 6, 2020, 6:55 AM IST

మిషిగన్, జార్జియా ఎన్నికల్లో అవకతకవలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం వేసిన దావాలను అమెరికా కోర్టులు కొట్టివేశాయి. మిషిగన్​లో స్థానిక లెక్కింపు ప్రక్రియతో రాష్ట్ర కార్యదర్శికి సంబంధం లేదని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్.

జార్జియాలోనూ పిటిషనర్ల అభ్యర్థనను జడ్జి జేమ్స్ బాస్ తిరస్కరించారు.

ఐదు రాష్ట్రాల్లో..

మిషిగన్​లో ఆలస్యంగా వచ్చిన బ్యాలెట్లను లెక్కించవద్దని, జార్జియాలో సరిగా లేని బ్యాలెట్లను లెక్కిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్ బృందం పిటిషన్లు దాఖలు చేసింది. వీటితోపాటు పెన్సిల్వేనియా, నెవడా రాష్ట్రాల్లోనూ దావాలు వేశారు. విస్కాన్సిన్​లో ఓట్లను రీకౌంటింగ్​ చేయాలని డిమాండ్ చేశారు.

మిషిగన్, విస్కాన్సిన్​​లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ గెలుపొందారని అమెరికా వార్తా సంస్థలు ప్రకటించగా.. జార్జియాలో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇదీ చూడండి:'బైడెన్​ నెగ్గిన అన్ని చోట్లా కేసులు.. మేమే గెలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details