అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరగనుంది. దీనిపై స్పందించిన ట్రంప్.. డెమోక్రటిక్ పార్టీ నాయకులు తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా రాజకీయ చరిత్ర పుటల్లోనే ఇదొక వింత చర్యగా అభివర్ణించారు.
నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్ - donald trump news today
డెమోక్రటిక్ పార్టీ నాయకులు తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ తీర్మానం తనకు తీవ్రమైన కోపాన్ని కలిగిస్తుందన్నారు. స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్ మైనారటీ నాయకుడు చక్ షుమెర్ ఈ మార్గంలో వెళ్లటం అమెరికాకు భయంకరమైన ప్రమాదమని చెప్పారు.

డెమొక్రాట్ల అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్
ఈ అభిశంసన తనకు తీవ్రమైన కోపాన్ని కలిగిస్తుందన్నారు ట్రంప్. స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్ మైనారటీ నాయకుడు చక్ షుమెర్ ఈ మార్గంలో వెళ్లటం అమెరికాకు భయంకరమైన ప్రమాదమని అన్నారు.