తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-7 సదస్సు వాయిదా.. కొత్తగా భారత్​కూ చోటు!

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సును కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గే వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కూటమిలో సభ్యత్వాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. కొత్తగా రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాతో పాటు భారత్​కూ చోటు కల్పించాలని భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Trump calls for delay in Group of 7 meeting
జీ-7 విస్తరణకు ట్రంప్​ పిలుపు.

By

Published : May 31, 2020, 8:14 AM IST

Updated : May 31, 2020, 8:32 AM IST

కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గే వరకు జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కనీసం ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఈ వాయిదా ఉండొచ్చని తెలుస్తోంది. జీ-7 కూటమిలోకి కొత్త దేశాలకు సభ్యత్వంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

భారత్​కు అవకాశం!

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీ-7 గ్రూప్‌లోకి భారత్‌ను చేర్చనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. భారత్​తో పాటు రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను గ్రూప్‌లోకి ఆహ్వానించాలని ట్రంప్‌ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న జీ-7ను కాలంచెల్లినదిగా అభివర్ణించిన ఆయన.. ప్రపంచ సమాజ అభీష్టానికి జీ-7 ప్రాతినిధ్యం వహించడం లేదని స్పష్టం చేశారు. గ్రూప్‌ను మరింత విస్తరించే వరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని పిలుపునిచ్చారు. జీ-7 గ్రూప్‌లో కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి.

కరోనా తగ్గే వరకు వాయిదా వేయాలని సభ్య దేశాలు కోరుతున్నా సమావేశం నిర్వహించాల్సిందేనని చెప్పుకొచ్చిన ట్రంప్​.. తాజాగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 12న అమెరికాలో జరగాల్సినా జీ-7 సమావేశం నిర్వహణ సందిగ్ధంలో పడింది.

Last Updated : May 31, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details