కరోనా వైరస్ వ్యాప్తిపై మరోమారు సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మాస్కులు ధరించినవారే ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. మయామిలో ఎన్బీసీ న్యూస్ టౌన్ హాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమధానంగా ఈ మేరకు స్పందించారు ట్రంప్.
'మాస్కులు ధరించిన వారే అన్ని వేళల వైరస్ బారినపడుతున్నారు' అని పేర్కొన్నారు ట్రంప్. అంతకు ముందే.. తాను మాస్క్‌తో సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం. అయితే.. వ్యాధి నియంత్రణ,నిర్మూలన కేంద్రాలు మాత్రం మాస్కులు ధరించటమే సరైన మార్గమమని స్పష్టం చేస్తున్నారు.
శ్వేతసౌధంలో సెప్టెంబర్ 26న జరిగిన భారీ బహిరంగ సభ గురించి ట్రంప్‌ను అడగ్గా ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సమావేశం ద్వారానే అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా సహా సభకు హాజరైన అతిథులు, ప్రజలు వైరస్ బారిన పడినట్లు భావిస్తున్నారు. ఇందులో చాలా మంది మాస్కులు ధరించలేదు.