తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2019, 12:16 PM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​పై బ్రిటన్​కు ట్రంప్ ఉచిత సలహా

బ్రిటన్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అధికారిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. బ్రెగ్జిట్​ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్​కు సలహా ఇచ్చారు ట్రంప్. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండానే వైదొలగాలని సూచించారు.

ట్రంప్

బ్రిటన్​లో మూడు రోజుల అధికారిక పర్యటన కోసం నేడు లండన్​ చేరుకోనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ట్రంప్​ దంపతులకు క్వీన్​ ఎలిజబెత్-2 స్వాగతం పలకనున్నారు. అనంతరం బ్రిటన్​ రాణి నివాసంలో విందు స్వీకరిస్తారు ట్రంప్.

'ప్రధానిగా ఆయనే సరి'

బ్రెగ్జిట్​ సంక్షోభం విషయంలో బ్రిటన్​కు సలహా ఇచ్చారు ట్రంప్. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బయటపడటమే ఉత్తమనని సూచించారు. బ్రిటన్​ ప్రధాని ఈ వారంలో పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆమె వారసుడిగా మాజీ విదేశాంగ మంత్రి బోరిస్​ జాన్సన్​ మంచి ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు ట్రంప్.

'అంత పెద్ద మొత్తమా?'

మే వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఈయూతో ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా, నిర్భయంగా తిరస్కరించాలన్నారు ట్రంప్​. ఆ స్థానంలో తానుంటే అంతపెద్ద మొత్తం ఈయూకి చెల్లించనని స్పష్టం చేశారు.

4 దశాబ్దాలుగా ఈయూ సభ్యదేశంగా బ్రిటన్​ ఉంది. సమాఖ్య నుంచి వైదొలిగే ముందు రుణాలకు గాను 50 బిలియన్ డాలర్లు చెల్లిస్తామని ఈయూతో బ్రిటన్​ ఒప్పందం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తం చెల్లించేందుకు సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని పార్లమెంటులోనూ మూడుసార్లు తిరస్కరించారు. ఫలితంగా బ్రెగ్జిట్‌ రెండుసార్లు వాయిదా పడింది. ​

ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికపై జూన్​ 18న ట్రంప్ అధికారిక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details