అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన వైఫల్యం వల్లే అఫానిస్థాన్లో ప్రభుత్వం కూలిపోయి తాలిబన్ల రాజ్యం(Afghanistan Taliban) వచ్చిందని ఆరోపించారు. కరోనా కట్టడి సహా అనేక విషయాల్లో బైడెన్ ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చట్టబద్ధంగా ఎన్నికవ్వలేదని, రాజీనామా చేయడం పెద్ద విషయమేమీ కాదని ట్రంప్ అన్నారు.
ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమిస్తూ ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌ను కూడా ఆదివారం తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. ఇక నుంచి దేశాన్ని తామే పాలిస్తామని ప్రకటించారు. గత్యంతరం లేక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. తజికిస్థాన్ వెళ్లిపోయారు. రక్తపాతం జరగకూడదనే తాను దేశాన్ని వీడినట్లు చెప్పారు.
అప్ఘాన్ సంక్షోభంపై జో బైడెన్ ఎలా స్పందిస్తారోనని శ్వేతసౌధం సలహాదారులు చర్చించుకుంటున్నారు. మరోవైపు అఫ్గాన్ ప్రజలకు బైడెన్ నమ్మకద్రోహం చేశారని.. నిరసనకారులు శ్వేతసౌధం వద్ద ఆదివారం ఆందోళనలు చేశారు.
6 వేల మంది బలగాలు