చమురు నౌకలపై దాడి చేసింది ఇరాన్ దేశమేనని ఆరోపించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రాముఖ్యమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసేందుకు యత్నిస్తోందన్న వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ జలసంధిని దిగ్బంధం చేయదని అభిప్రాయపడ్డారు.
అమెరికా ఆరోపణలను ఇరాన్ తిప్పికొట్టింది. ఇరాన్ ప్రధాని అయాతొల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించేందుకు జపాన్ సుప్రిమో షింజో అబే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కారణంగానే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది ఇరాన్.
ఇరానే కారణం: బ్రిటన్