తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ X బైడెన్: పారిస్​ ఒప్పందంపై మాటల యుద్ధం

పర్యావరణ అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను తప్పుపట్టారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. పారిస్ ఒప్పందంలో చేరడం పర్యావరణ పరిరక్షణ రీత్యా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ట్రంప్ మాత్రం పారిస్ ఒప్పందం అనేది చాలా దారుణమైందన్నారు. ఇరువురి నేతల మధ్య ప్రత్యక్షంగా జరిగిన తొలి సంవాదంలో ఈ వ్యాఖలు చేశారు.

trump-biden-deabate-on-environment-issue
ట్రంప్​ X బైడెన్: పారిస్​ ఒప్పందం మాటల యుద్ధం

By

Published : Sep 30, 2020, 9:40 AM IST

Updated : Sep 30, 2020, 9:55 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య తొలి ప్రత్యక్ష ఎన్నికల సంవాదం వాడీవేడీగా జరిగింది. తాము అధికారంలోకి వస్తే పారిస్ ఒప్పందంలో తిరిగి చేరుతామని బైడెన్ ప్రకటించారు. అమెరికా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు పురోగమించాలని, 2035 నాటికి కాలుష్య ఉద్గారాలు సున్నా స్థాయికి చేరాలన్నారు. కొత్త హరిత విధానం మేరకు కాలుష్య కారక కేంద్రాలను మూసేస్తామని స్పష్టం చేశారు.

ట్రంప్ మాత్రం పారిస్ ఒప్పందం చాలా దారుణమైందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పర్యావరణం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణం పేరుతో వ్యాపారాలను దెబ్బతీయకూడదని.. సమర్థమైన అటవీ నిర్వహణ రావాలన్నదే తన ఉద్దేశమన్నారు.

Last Updated : Sep 30, 2020, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details