విజయంపై నమ్మకం కోల్పోకూడదని మద్దతుదారులకు సూచించారు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న ఫలితాల సరళితో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. చివరి బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే వరకు విశ్వాసంతో ఉండాలని మద్దతుదారులకు సూచించారు బైడెన్. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని స్పష్టం చేశారు.
ట్రంప్ కూడా..
బైడెన్ ప్రకటన చేసిన కాసేపటికే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.