ప్రతినాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వ్యక్తి, గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 45 మంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేపట్టారు. కేవలం వీరిలో పదిమంది అధ్యక్షులు మాత్రమే వరుసగా రెండోసారి తిరిగి ఎన్నిక కాలేదు. అయితే, వీరిలో కొందరు చనిపోవడం కారణం కాగా, మిగతావారు మాత్రం రెండోసారి తిరిగి ఎన్నిక కావడంలో విఫలమయ్యారు.
ఉదాహరణకు జాన్ ఎఫ్ కెన్నడీ రెండోసారి అధ్యక్ష ఎన్నికల ముందే హత్యకు గురయ్యారు. అయితే 1932 నుంచి 1976 వరకు ఎన్నికైన అధ్యక్షుల్లో ఎవ్వరుకూడా రెండోసారి ఓడిపోకపోవడం విశేషం.
రెండో సారి తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టని నేతల విషయానికి వస్తే ఈ జాబితాలో జాన్ అడమ్స్ మొదట ఉంటారు. 1789లో అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నిక కాగా జాన్ అడమ్స్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. జార్జ్ వాషింగ్టన్ పదవి రెండుసార్లు పూర్తైన తర్వాత జాన్ అడమ్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తిరిగి రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టలేకపోయారు.
ఇదీ చూడండి:-ఎన్నికల్లో ఇవే ట్రంప్ కొంప ముంచాయా?
అడమ్స్ కుటుంబానికే చెందిన జాన్ క్విన్సీ అడమ్స్ కూడా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మార్టిన్ వాన్ బ్యూరెన్ 1840 ఎన్నికల్లో తిరిగి రెండోసారి గెలుపొందలేదు. 1884లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన గ్రోవర్ క్లెవెలాండ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలువలేదు. కానీ 1884లో ఒకసారి, 1892లో రెండోసారి గెలుపొంది అధ్యక్ష పదవి చేపట్టారు.
1888లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బెంజమిన్ హ్యరీసన్ చేతిలో గ్రోవర్ క్లెవెలాండ్ ఓడిపోగా, తర్వాత పర్యాయం జరిగిన ఎన్నికల్లో తిరిగి గ్రోవర్‌లాండ్ గెలుపొందడంతో బెంజమిన్ హ్యరీసన్ రెండోసారి అధ్యక్షపదవి చేపట్టలేకపోయారు.