తెలంగాణ

telangana

ETV Bharat / international

గోడ నిర్మాణానికి ట్రంప్ మద్దతుదారుల ముందడుగు - MEXICO

అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు ఓ అమెరికా మిలిటరీ మాజీ అధికారి. తనకు చెందిన ప్రైవేటు భూభాగంలో ట్రంప్​ మద్దతుదారుల నుంచి సేకరించిన విరాళాలతో ఈ కార్యక్రమానికి నడుం బిగించారు.

Trump

By

Published : May 28, 2019, 6:20 AM IST

Updated : May 28, 2019, 7:42 AM IST

తనకు చెందిన ఓ ప్రైవేటు భూభాగంలో మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం ప్రారంభించారు అమెరికా మిలిటరీ మాజీ అధికారి బ్రయాన్ కాల్ఫేజ్​​. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మద్దతుదారుల నుంచి సేకరించిన విరాళాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.

గోడ నిర్మాణానికి ట్రంప్ మద్దతుదారుల ముందడుగు

'వియ్​ బిల్డ్ ద వాల్​' అనే సంస్థను ప్రారంభించి ఆన్​లైన్లో 20 మిలియన్​ డాలర్ల విరాళాలు సేకరించారు కాల్ఫేజ్​. ఈ నిధులతోనే ప్రైవేటు భూభాగంలో అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం ప్రారంభించారు. ట్రంప్ ఎన్నికల హామీని కాంగ్రెస్ అడ్డుకున్నా ఆయన మద్దతుదారులమంతా ఏకమై సరిహద్దు గోడ నిర్మాణం చేపడతామన్నారు ఆ భూమి సహ యజమాని జెఫ్ అలెన్​.

దాదాపు 800 మీటర్ల మేర ఉన్న తన ప్రైవేటు భూమిలో ప్రభుత్వం ఎలాంటి గోడను నిర్మించాలనుకుందో అదే ప్రమాణాలతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు అలెన్​.

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల మంజూరు చేసేందుకు నిరాకరించింది కాంగ్రెస్. దీంతో గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు అత్యయిక స్థితి విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. రక్షణ శాఖ నిధులను మళ్లించేందుకు​ ట్రంప్​ చేస్తున్న పరిపాలన విధమైన ప్రయత్నాలను నిలిపేస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం.

ఇదీ చూడండి: ఒక్క ప్రశ్నకు.. 10 వేల సమాధానాలు

Last Updated : May 28, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details