గుమ్మం దాటితే చాలు.. ఎక్కడ చూసినా మాస్క్లు ధరించిన ముఖాలే దర్శనమిస్తున్నాయి. మాస్క్ లేకపోతే కనీసం జేబు రుమాలైనా కట్టుకుని తిరుగుతున్నారు. ఇంతలో ఎంత మార్పు.. ఏం తంటా తెచ్చిపెట్టావే కరోనా! అనుకుంటున్నారంతా.
కానీ కరోనా నుంచి కూడా ఆయనకు మినహాయింపు ఉంది. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 'మాస్కా.. నేను ధరించను. నాకవసరం లేదు..' అని ఇప్పటికే పలుమార్లు తెగేసి చెప్పారు ఆయన. కానీ ట్రంప్ మాస్క్ ధరిస్తే చూద్దామని ప్రజలు... క్లిక్ మనిపించి చూపిద్దామని విలేకర్లు ఆయన వెనుక తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆ దృశ్యం కనపడిందే లేదు.
అయితే ట్రంప్ తానే స్వయంగా మాస్క్ ధరించానని ఒప్పుకున్నారు. గురువారం మిషిగాన్ రాష్ట్రంలోని ఫోర్డ్ కర్మాగారాన్ని సందర్శించారు ట్రంప్. అనంతరం అక్కడి విలేకర్లతో మాట్లాడారు. ఆ సమయంలో విలేకర్లు మాస్క్ వేసుకున్నారా? అని అడగ్గా.. ట్రంప్ తనదైన రీతిలో సమాధానమిచ్చారు.
రిపోర్టర్: మీరు మాస్క్ వేసుకోకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు?
ట్రంప్:నేను ఇంతకుముందే మాస్క్ వేసుకున్నాను. కర్మాగారాన్ని చూడటానికి వెళ్లినప్పుడు ధరించాను. కానీ అది చూసే భాగ్యాన్ని మీడియాకు ఇవ్వను.
రిపోర్టర్: మీరు గాగుల్స్ కూడా ధరించారా?