తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ ఎన్నికల ప్రచార బృందానికి కొత్త సారథి

అమెరికా ఎన్నికలకు 16 వారాలే సమయం ఉండగా ట్రంప్ తన ప్రచార విభాగానికి కొత్త మేనేజర్​ను నియమించారు. ఇప్పటికే ప్రచార బృందంలో ఉన్న బిల్ స్టెపియన్ మేనేజర్​గా పదోన్నతి పొందినట్లు ప్రకటించారు ట్రంప్. ఇదివరకు ఆ హోదాలో ఉన్న బ్రాడ్ పార్స్కేల్​ను సీనియర్ సలహాదారుడిగా కొనసాగనున్నట్లు తెలిపారు.

Trump announces new campaign manager
ఎన్నికల వేళ ట్రంప్ ప్రచారానికి కొత్త మేనేజర్

By

Published : Jul 16, 2020, 12:16 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్​కు కొత్త సారథిని నియమించారు. ప్రచార బృందంలో రెండో స్థానంలో ఉన్న బిల్ స్టెపియన్​ ఇక నుంచి క్యాంపెయిన్​కు నేతృత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రచార విభాగాధిపతిగా ఉన్న బ్రాడ్ పార్స్కేల్ సీనియర్ సలహాదారుడి హోదాలో కొనసాగుతారని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలలు ఉన్న సమయంలో ట్రంప్ ఈ మార్పులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ పదవికి బిల్ స్టెపియన్​ పదోన్నతి పొందారని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు నాతో పాటే ఉండి, డిజిటల్, డేటా వ్యూహాలకు నాయకత్వం వహించిన బ్రాడ్ పార్స్కేల్ సీనియర్ సలహాదారుడి పాత్ర పోషిస్తూ అదే హోదాలో కొనసాగుతారు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

2016 ఎన్నికల విజయంలో ఇరువురు ప్రధాన పాత్ర పోషించారని ట్రంప్ గుర్తు చేశారు. ఈ ద్వయంతో కలిసి ఈసారీ విజయం సాధించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పోల్స్​లో తానే ముందంజలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

"మా పోల్ నెంబర్లు(ముందస్తు సర్వేల్లో అనుకూల ఓట్లు) చాలా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి విజయం చాలా సులభం. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది. వ్యాక్సిన్​లు, చికిత్స విధానాలు త్వరలోనే వస్తాయి. అమెరికన్లు కూడా సురక్షితమైన సమాజాన్ని కోరుకుంటున్నారు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అయితే తాజా ఒపీనియన్ పోల్స్​లో ట్రంప్ ఎన్నికల ప్రత్యర్థి, డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. నేషనల్ పోల్స్​లో అధ్యక్షుడితో పోలిస్తే 8 శాతానికి పైగా ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

ప్రచార జోడీ

2016 ఎన్నికల్లో పార్స్కేల్​... ట్రంప్ డిజిటల్ ప్రచారాన్ని నడిపించారు. అధ్యక్షుడు అనూహ్య విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు.

స్టెపియన్ కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాజీ న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీతో పనిచేయడం సహా... 2016 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఫీల్డ్ డైరెక్టర్​గా స్టెపియన్ సేవలందించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details