భారతీయ అమెరికన్ విజయ్ శంకర్‌ను వాషింగ్టన్‌లోని అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా సిఫార్సు చేసే యోచనలో ఉన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ నిర్ణయానికి సెనేట్ ఆమోదం తెలిపితే.. కొలంబియా కోర్టులోని అప్పీల్స్ విభాగంలో అసోసియేట్ జడ్జిగా సేవలందించనున్నారు విజయ్. ప్రస్తుతం ఆయన.. న్యాయశాఖలోని క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్‌గా, అప్పీలేట్ సెక్షన్లో డిప్యూటీ చీఫ్‌గా పని చేస్తున్నారు.
'విజయ్' ప్రస్థానం..
2012లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన విజయ్.. అంతకముందు వాషింగ్టన్లో పలుచోట్ల ప్రైవేట్ లాయర్‌గా చేశారు. లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పొందాక 'స్టేట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆన్ ది సెకండ్ సర్క్యూట్'లో న్యాయమూర్తి చెస్టర్ జే. స్ట్రాబ్ వద్ద క్లర్క్‌గా పని చేశారు.
ఉత్తర కరోలినాలో బీఏ పూర్తిచేసిన విజయ్.. వర్జీనియా స్కూల్ ఆఫ్ లా యూనివర్శిటీ నుంచి జీడీ(జ్యూరిస్ డాక్టర్) పట్టాపొందారు. అక్కడే లా రివ్యూ కోసం ఎడిటర్‌గా పనిచేస్తూనే, ఆర్డర్ ఆఫ్ కోయిఫ్లో చేరారు.
ఇదీ చదవండి:జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి..