తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్విట్టర్​​పై ట్రంప్ ఆగ్రహం.. కారణమిదే! - trump twitter news

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ను విమర్శిస్తూ ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్, ఫేస్​బుక్ సెన్సార్ చేయడంపై మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఈ రెండు మాధ్యమాలూ కావాలనే సెన్సార్ చేశాయని ఆరోపించారు.

Trump angry on Twitter for changing the rules
నిబంధనలు మార్చారని ట్విట్టర్​ పై ట్రంప్ ఆగ్రహం

By

Published : Oct 17, 2020, 6:46 PM IST

డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయని ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. హంటర్‌ ఈ మెయిల్‌లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ సమాచారం హంటర్‌కు చెందిన పాత కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అయితే నిర్ధరణ కాని ఆ ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని పలు విమర్శలు రావడం వల్ల ఫేస్ బుక్, ట్విట్టర్ ఈ వార్తకు సంబంధించిన లింక్లను బ్లాక్ చేశాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.

ట్రంప్‌ అభ్యంతరం

ట్రంప్‌ వర్గం ఈ చర్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ప్రత్యర్థి జో బైడెన్​ను విమర్శిస్తూ ప్రచురించిన ఈ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలూ కావాలనే సెన్సార్ చేశాయని అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. కాగా, నిజానిజాలను నిర్ధరించుకోకుండా తాము ఈ కథనానికి సంబంధించిన లింక్‌లను పోస్ట్ చేయలేమని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా ట్విట్టర్‌ తన నిర్ణయాన్ని బయటకు ప్రకటించకపోవటం వల్ల ఆ వార్తను షేర్‌ చేయటానికి ప్రయత్నించి విఫలమైన యూజర్లు అయోమయానికి గురయ్యారు.

ట్విట్టర్‌ స్పందన

ఈ పరిస్థితిపై ట్విట్టర్‌ సీఈఓ జార్‌ డోర్సీ స్పందించారు. తాము సంస్థ నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నప్పటికీ.. తగిన వివరణ ఇవ్వకుండానే అలా చేయటం ఆమోదనీయం కాదని ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో హ్యాకింగ్‌ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేస్తూ ట్విట్టర్‌ తాజా నిర్ణయం తీసుకుంది. హ్యాక్‌ చేశారని భావిస్తున్న సమాచారాన్ని, అది హ్యాకర్లు షేర్‌ చేస్తే తప్ప తొలగించబోమని సంస్థ ఉన్నతాధికారి విజయా గద్దే తాజాగా ప్రకటించారు. సదరు సమాచారాన్ని షేర్‌ చేయకుండా నిరోధించేందుకు బదులుగా... వివరాలను సరిచూసుకోవాల్సిందిగా సంబంధిత పోస్టుపై సూచన వెల్లడవుతుందని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details