అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడన్ తొలిసారి ప్రత్యక్ష సంవాదంలో పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆర్థికవ్యవస్థ అంశంపై మాట్లాడుతూ ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ట్రంప్ హయాంలో అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలు పోయాయని బైడెన్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్దతిన్నదని ధ్వజమెత్తారు. కరోనాపై ముందస్తు సమాచారం ఉన్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని దుయ్యబట్టారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం చేయూత అందించలేదన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళిక లేదని.. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం చేయూత అందించలేదని ఆరోపించారు.
ట్రంప్ X బైడెన్: ఆర్థిక వ్యవస్థపై ఢీ అంటే ఢీ - అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య తొలి సంవాదం రసవత్తరంగా సాగింది. చర్చలో భాగంగా ఆర్థిక వ్యవస్థ అంశంపై ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలకు దిగారు. ట్రంప్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత రేటు పెరిగిందని బైడెన్ ఆరోపించారు. బైడెన్ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికాను మూసేయాలని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు.
'ట్రంప్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం'
బైడెన్ విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. తాను చేపట్టిన చర్యల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి సాధిస్తోందన్నారు. బైడెన్ అమెరికాను మూసేయాలని కోరుకుంటున్నారని.. తాను మాత్రం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించానని చెప్పారు.
Last Updated : Sep 30, 2020, 10:04 AM IST