అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడు రోజర్ స్టోన్‌కు 40 నెలల జైలు శిక్ష పడింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు రష్యాతో కలిసి కుట్ర పన్నారని రోజర్ స్టోన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై నమోదైన కేసులో అమెరికా కాంగ్రెస్ దర్యాప్తును రోజర్ అడ్డుకున్నట్లు రుజువైనందున కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
స్టోన్ చాలా కాలంగా ట్రంప్‌కు సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి రష్యాతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత మంది న్యాయవాదులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రోజర్ సాక్ష్యులను బెదిరించడం, కాంగ్రెస్‌కు అసత్యాలు చెప్పడమే కాక.. హౌస్ దర్యాప్తును అడ్డుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారించి కోర్టు నవంబరులో స్టోన్‌ను దోషిగా తేల్చింది.
ఈ కేసు విషయంలో రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు స్టోన్ చేసిన చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమీ బెర్మాన్ జాక్సన్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఏమన్నారంటే..