అమెరికా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన మద్దతుదారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. జో బైడెన్‌కు అధికారం అందనీయకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర చట్టసభ్యులకు కూడా శ్వేతసౌధం నుంచి సమన్లు జారీ చేస్తున్నారు. వీటితోపాటు స్థానిక ఎన్నికల అధికారులను వ్యక్తిగతంగా పిలవటం, ఓట్ల లెక్కింపును ఆలస్యం చేయాలని కౌంటీ అధికారులను ఆదేశించటం.. ఇలా అనేక మార్గాల్లో ఒత్తిడి తేవటం ఆ కోవలోనికే వస్తాయని నిపుణులు అంటున్నారు.
అధికారులు చెబుతున్నా..
అదే సమయంలో ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా చరిత్రలో 2020 ఎన్నికలే అత్యంత సురక్షితమైనవని చెప్పిన ఉన్నతాధికారిపై ట్రంప్ వేటువేశారు.