తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారీగా పన్నులు తగ్గిస్తా': ఎన్నికల ప్రచారంలో ట్రంప్​ - trump said tax cut reduce in upcoming elections

అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రజలు తనకు మరలా అధికారాన్ని అప్పగిస్తే భారీగా పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రత్యర్థులు మాత్రం ఈ భారీ పన్ను తగ్గింపు వల్ల కేవలం ధనికులకే లబ్ధి చేకూరుతుందని, ఆయన పాలనలో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందని విమర్శించారు.

'భారీగా పన్నులు తగ్గిస్తా': ఎన్నికల ప్రచారంలో ట్రంప్​

By

Published : Nov 16, 2019, 3:01 PM IST

Updated : Nov 16, 2019, 3:27 PM IST

'భారీగా పన్నులు తగ్గిస్తా': ఎన్నికల ప్రచారంలో ట్రంప్​

అమెరికాలో ఎన్నికల జోరు పెంచారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అధికారమే లక్ష్యంగా ప్రజలకు చేరువయ్యేందుకు హామీలను ఇస్తున్నారు. తాజాగా ఓ హామీని ప్రకటించారు. రిపబ్లికన్​ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మధ్యతరగతి వర్గాలకు భారీగా పన్నులు తగ్గిస్తామని వాగ్దానం చేశారు.

పన్ను చెల్లింపులో మినహాయింపు, సవరణలు, సరైన వాణిజ్య భాగస్వాములను ఎంచుకోవటం వల్లే అమెరికా సుస్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ​వచ్చే ఎన్నికల్లో ఇదే తమ ప్రధాన అజెండా అని అన్నారు.

ధనికులకే లబ్ధి...

విమర్శకులు మాత్రం ట్రంప్​ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని అంటున్నారు. ఈ భారీగా పన్ను కోతలు అనేది మధ్య తరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని కేవలం ధనవంతులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ఇప్పటికే ఆయన పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్​ డాలర్లకు పడిపోయిందని విమర్శించారు.

ఇతర దేశాలతో ట్రంప్ చేస్తోన్న​ వాణిజ్య యుద్ధం కారణంగా వ్యాపార రంగంలో ఉత్పత్తులు, పెట్టుబడులు తగ్గాయని.. దీనితో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ మందగమనం దిశగా సాగుతోందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2020లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జో బిడెన్​ సహా పలువురు ట్రంప్​నకు గట్టి సవాల్​ విసురుతున్నారు.

ఇదీ చూడండి : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్​లో కాల్పుల కలకలం

Last Updated : Nov 16, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details