అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ఓటమిని అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన రెండు వారాల తర్వాత తొలిసారి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారని బహిరంగంగా పేర్కొన్నారు ట్రంప్. అయితే.. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ తన పోరాటాన్ని ఆపనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికలపై ట్వీట్ చేశారు ట్రంప్.
"ఎన్నికల్లో రిగ్గింగ్ జరగటం వల్లే బైడెన్ గెలిచారు. ఓట్ల పరిశీలకులను అనుమతించలేదు. రాడికల్ లెఫ్ట్ ప్రైవేటు యాజమాన్య సంస్థ ఓట్లను లెక్కించింది. దానికి చడ్డ పేరు ఉంది. పరికరాలు కూడా సరిగ్గా లేవు. దుష్ప్రచారాలు జరిగాయి. వీటిపైపై మీడియా మౌనంగా ఉంది!"