తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​కు అమెరికా షాక్​.. మరోసారి కఠిన ఆంక్షలు

సౌదీ అరేబియా చమురు నిక్షేపాలపై దాడికి ఇరాన్​ను అనుమానిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశంపై అదనపు ఆంక్షలు విధించింది. ఇరాన్ జాతీయ బ్యాంకుపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్​కు అన్ని రకాల నిధుల రాకను మూసివేశామని అగ్రరాజ్య అధికారి ఒకరు వెల్లడించారు.

By

Published : Sep 21, 2019, 6:42 AM IST

Updated : Oct 1, 2019, 10:01 AM IST

ఇరాన్​కు షాక్​.. అమెరికా కఠినతర ఆంక్షలు

ఇరాన్​పై మరోసారి కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి చేసినందుకే ఈ నూతన ఆంక్షలు విధిస్తున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు. అలాగే వీటిని ఒక దేశంపై అమెరికా విధించిన అత్యంత కఠిన ఆంక్షలుగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్​తో సమావేశం అనంతరం ఇరాన్​పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇరాన్ జాతీయ బ్యాంకుపై ఆంక్షలు విధించి.. అన్ని రకాల నిధుల రాకను మూసివేశామని అగ్రరాజ్య అధికారి ఒకరు వెల్లడించారు.

అమెరికా ఆరోపణలను ఖండించిన ఇరాన్..

సౌదీ అరేబియాపై దాడి ఆరోపణలను కొట్టిపారేసింది ఇరాన్. ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అలాగే అమెరికా తమపై చేస్తున్న ఆరోపణలు ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలను పెంచుతాయని ఆందోళనలు వ్యక్తం చేసింది.

2015లో అణు ఒప్పందాన్ని ఇరాన్ నిరాకరించినప్పటి నుంచి ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది అగ్రరాజ్యం. తాజా ఆంక్షలు ఒత్తిడి కొనసాగింపు దిశగానే చేసినట్లు అమెరికా వెల్లడించింది.

Last Updated : Oct 1, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details