తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​-1బీ వీసా మంజూరులో లాటరీ వ్యవస్థ రద్దు! - హెచ్​ 1బీ వీసా తాజా వార్తలు

హెచ్​-1బీ వీసా మంజూరు చేసేందుకు ఇప్పటివరకు కంప్యూటరైజ్డ్​ లాటరీ వ్యవస్థను అనుసరిస్తోంది అమెరికా ప్రభుత్వం. తాజాగా దీని స్థానంలో వేతనం ప్రాతిపదికన వీసాలు మంజూరు చేయాలని సూచించింది. అమెరికన్ల వేతనాలపై పడుతున్న భారాన్ని ఇది తగ్గిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

Trump admin proposes to scrap computerised lottery system to select H-1B visas
హెచ్​-1బీ వీసా మంజూరులో లాటరీ వ్యవస్థ రద్దు!

By

Published : Oct 29, 2020, 11:37 AM IST

విదేశీ సాంకేతిక నిపుణులకు అందించే హెచ్​-1బీ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చేసేందుకు ప్రతిపాదించింది అమెరికా ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్​ లాటరీ వ్యవస్థను తొలగించి.. ఆ స్థానంలో వేతనం ప్రాతిపదికన వీసాలు జారీ చేయాలని సూచించింది. అమెరికన్ల వేతనాలపై పడుతున్న భారాన్ని ఇది తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కొత్త వ్యవస్థకు సంబంధించిన నోటిఫికేషన్​ను ఫెడరల్​ రిజిస్టర్​లో ప్రచురించింది డీహెచ్​ఎస్​( డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోంల్యాండ్​ సెక్యూరిటీ). అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువున్న నేపథ్యలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నోటిఫికేషన్​పై స్పందించేందుకు 30రోజుల గడువిచ్చింది.

తాజా ప్రతిపాదనను అమలు చేస్తే.. విదేశీ ఉద్యోగులకు సంస్థలు అధిక జీతాలు చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో ఆ స్థాయిలో జీతాలు పొందడానికి విదేశీయుల్లో నైపుణ్యం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది.

ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే... ఇమ్మిగ్రేషన్​ సర్వీస్​ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీఓసీసీ (స్టాండర్డ్​ ఆక్యుపేషనల్​ క్లాసిఫికేషన్​ కోడ్​)కు సమాన లేదా దానికి మించిన వేతనాలు ఉన్న పిటిషనర్లకు హెచ్​-1బీ వీసా మంజూరు చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు.

'అమెరికన్​ ఫస్ట్​' విధానంలో భాగంగా అమెరికన్లకు ఉద్యోగాలిచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ యంత్రాంగ లక్ష్యానికి ఈ తాజా ప్రతిపాదన సహాయపడుతుందని అధికారవర్గం చెబుతున్నాయి.

ఇదీ చూడండి:-హెచ్‌-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!

ABOUT THE AUTHOR

...view details